Pithapuram : పిఠాపురంలో రాజకీయం రాజుకుంటుంది. ఎమ్మెల్సీ గా నాగబాబు అయినప్పుడు నుండి అక్కడ పరిస్థితి మొత్తం మారిపోయింది. ఇటీవలే ఎమ్మెల్సీ నాగాబాబు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. అయితే టీడీపీ నేత వర్మ ఈ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. నాగాబాబు సందర్శించిన ప్రాంతాలలో టిడిపి కార్యకర్తలు వర్మకు మద్దతుగా నినాదాలు చేశారు. జనసేనా నాయకులు నినాదాలు చేసారు. ఈ క్రమంలో జనసేన, టీడీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. అయితే తనను దూషించారని టీడీపీ నాయకులపై జనసేన నేత ఫిర్యాదు చేశారు. జనసేన నాయకుల ఫిర్యాదుతో టీడీపీ నేతలపై కేసు నమోదైంది. తెలుగు దేశ పార్టీ నేతలపై పోలీసులు రెండు కేసులను నమోదు చేశారు.