నేడు, రేపు సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. విదేశాల్లో వేలం నిర్వహించడం వరుసగా ఇది రెండోసారి. కాగా, ఈ నేపథ్యంలో మెగా వేలానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ఈ మెగా వేలం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభమవుతుంది. గంటన్నర వేలం తర్వాత 45 నిమిషాల భోజన విరామం ఉంటుంది. ఆ తర్వాత స్థానికంగా రాత్రి 8 గంటల వరకు వేలం కొనసాగుతుంది. ఐపీఎల్ మెగా వేలం కోసం 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, ఫ్రాంచైజీల సూచనల మేరకు బీసీసీఐ 577 మంది ఆటగాళ్లను మాత్రమే షార్ట్ లిస్ట్ చేసింది. వీరిలో మొత్తం 204 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. అందులో 70 మంది విదేశీ ఆటగాళ్లు ఉంటారు. ఐపీఎల్ మెగా యాక్షన్‌ను టీవీలో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో చూడాల్సిందే. Jio సినిమా యాప్ ద్వారా మీరు దీన్ని మొబైల్‌లలో ఉచితంగా చూడవచ్చు. అలాగే మీరు జియో సినిమా వెబ్‌సైట్‌లో కూడా లైవ్ స్ట్రీమింగ్‌ను ఉచితంగా చూడవచ్చు.