planning to arrest me raghurama krishnam raju said..
Narasapuram Rebel MP raghurama krishnam raju has been deeply dissatisfied with the YCP government in power in the AP for some time now.
raghurama krishnam raju, who is often critical of the YCP government’s policies and YCP leaders, had lodged a complaint with the LokSabha Speaker on the 1st of this month against the AP DGP and others.
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై నరసాపురం రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గతకొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
తరచూ వైసీపీ ప్రభుత్వ విధానాలపైనా, వైసీపీ పెద్దలపైనా విమర్శలు గుప్పించే రఘురామకృష్ణరాజు ఈ నెల 1న ఏపీ డీజీపీపైనా, మరికొందరు ఇతరులపైనా లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.
తనను అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నుతున్నారంటూ ఆరోపించారు.
తనను నియోజకవర్గానికి రానివ్వకుండా వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారని వెల్లడించారు. ఈ మేరకు ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చారు.
రఘురామకృష్ణరాజు ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ కార్యాలయం స్పందించింది. ఎంపీ చేసిన ఫిర్యాదును కేంద్ర హోంశాఖ ముందుంచింది.
అంతేకాకుండా, దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి వివరణ తీసుకుని 15 రోజుల్లోనే నివేదిక సమర్పించాలని ఆదేశించింది.