ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి ప్రభుత్వ కళాశాలలో తాజా మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం కాలేజీ యాజమాన్యంతో కలిసి కొత్త మొక్కలను నాటారు. అలాగే అక్కడ పేరుకుపోయిన చెత్త మరియు తుప్పలను తన సొంత డబ్బులతో జెసిబి మరియు బ్లేడ్ బండిని తెప్పించి గ్రౌండ్ ఆవరణాన్ని మరియు కాలేజీ వెనకాల సైడు ఉన్న పొదలను, పిచ్చి మొక్కలను చెట్లను, అంత శుద్ధి చేసి తొలగించడం జరిగింది. ఇంకా ఎలాంటి సహాయమైనా చేయడానికి నేనున్నానంటూ కాలేజీ యాజమాన్యానికి మరియు విద్యార్థులకు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశం, రజక సంఘం అధ్యక్షుడు కలకోట సత్యం, కన్ను, చెవులమద్ది సంతోష్, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.