Homeఆంధ్రప్రదేశ్ప్లీజ్.. మేడం అనకండి.. అక్కా అని పిలవండి: సీతక్క

ప్లీజ్.. మేడం అనకండి.. అక్కా అని పిలవండి: సీతక్క

ఇదే నిజం, వెబ్ డెస్క్: కాంగ్రెస్‌ది దొరల పాలన కాదని.. ప్రజల పాలన అని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని జైనథ్‌ మండలంలోని ఆదివాసీ గిరిజన గ్రామం జామినిలో గురువారం ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఆరు గ్యారంటీ పథకాలకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనను మేడం అని కాకుండా.. సీతక్కగానే పిలవాలని కోరారు. సీతక్క అన్న పిలుపులోనే ఆప్యాయత ఉంటుందని.. ఎంత ఎదిగినా తాను ప్రజల మనిషినేనని అన్నారు.

ఇంద్రవెల్లిలో ఎకరం స్థలంలో స్మృతివనం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆదివాసీలకు అండగా నిలిచిన హైమన్‌డార్ఫ్‌ సేవలు గుర్తు చేశారు. నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన కుమురం భీం స్ఫూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతామని పేర్కొన్నారు. జామిని గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఆదిలాబాద్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img