టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ మూడేళ్ల పదవీకాలం ముగిసింది. దీనిపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను నిరుద్యోగినంటూ చెప్పుకొచ్చారు. తనకు ఏమైనా జాబ్ ఆఫర్లు ఉంటే చెప్పాలంటూ సరదాగా వ్యాఖ్యానించారు. కాగా, భారత్ టీ-20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత తక్కువగా మాట్లాడే ఆయన తొలిసారిగా గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకుంటూ కనిపించారు.