ఏజెంట్ చేతుల్లో మోసపోయి తెలుగు ప్రజలు విదేశాల్లో అష్టకష్టాలు పడుతున్నారు. ఏపీలోని అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామానికి చెందిన శివ ఘటన మరువక ముందే.. తాజాగా వీరేంద్ర కుమార్ అనే మరో వ్యక్తి సౌదీలో చిక్కుకున్నాడు. రక్తపువాంతులు అవుతున్నాయని, చచ్చిపోయేలా ఉన్నానంటూ సోషల్ మీడియాలో వీడియో పెట్టాడు. ఈ వీడియోపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. డోంట్ వర్రీ.. నేను ఉన్నానంటూ హామీ ఇచ్చారు.