Homeజిల్లా వార్తలుబాల్య వివాహాలు లేని భారత దేశం కోసం ప్రతిజ్ఞ

బాల్య వివాహాలు లేని భారత దేశం కోసం ప్రతిజ్ఞ

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని అంగన్వాడీ టీచర్స్ అందరికి బాల్యవివాహాల పైన అవగహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కైలాష్ సత్యర్థి చైల్డ్ ఫౌండేషన్ సహాయ వెల్ఫేర్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా కో ఆర్డినేటర్ పోలవేణి భూమేష్ హాజరు అయ్యారు.ముఖ్యంగా బాల్యవిహాలు జరిగితే వచ్చే నష్టాల గురించి చెప్పడం జరిగింది.బాల్య వివాహాలు జరిగితే చైల్డ్ లైన్ 1098 కి ఫోన్ చేసి చెప్పాలని అలాగే బాల్య వివాహాలు చేయడం చట్ట రీత్యా నేరమని ఒక వేల చేస్తే 2సంవత్సరాల జైలు శిక్ష మరియు లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జ్యోతి,జానకి,కౌన్సిలర్ లత అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img