న్యూఢిల్లీః కరోనా వైరస్‌ను ఎదుర్కోనేందుకు ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన పీఎం కేర్స్ కు కేవలం 5 రోజుల్లోనే రూ.3వేల కోట్లు జమైనట్లు ఆడిట్ నివేదిక స్పష్టం చేసింది. మార్చి 27న పీఎం కేర్స్ ను రూ.2,25,000ల కార్పస్ ఫండ్‌తో ప్రారంభించారు. మార్చి 27వ తేదీ నుంచి మార్చి 31 వరకు ఈ మొత్తం(రూ.30,76,62,58,096) చేకూరినట్లు తాజాగా ఆడిట్ నివేదిక వెల్లడించింది. ఈ ఆడిట్ నివేదికను పీఎం కేర్స్ వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచింది. అయితే మార్చి 31తర్వాత వచ్చిన విరాళాల గురించి ఇందులో ప్రస్తావించకపోవడం గమనార్హం.
దాతల పేర్లు చెప్పరెందుకు
పీఎం కేర్స్ ఆడిట్ నివేదికపై మాజీ ఆర్థిక శాఖమంత్రి పి.చిదంబరం ట్విటర్‌లో స్పందించారు. విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు ఎందుకు వెల్లడించడం లేదన్నారు. దాతల పేర్లు బహిర్గతం చేయడానికి ట్రస్టీలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.