PM-KISAN: అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. పీఎం కిసాన్ 19వ విడత కింద ఈ నెల 24న రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. బిహార్లోని భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ నిధులు విడుదల చేయనున్నారు. అయితే E-KYC పూర్తి చేసిన వారికి మాత్రమే డబ్బులు అందుతాయి. ఈ విడతలో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద, అర్హులైన ప్రతి రైతు అకౌంట్లో మూడు విడతల్లో రూ. 2,000 చొప్పున మొత్తం రూ.6,000 క్రెడిట్ చేస్తారు.