PM-Kisan: పీఎం కిసాన్ లబ్దిదారులకు అలర్ట్. పీఎం కిసాన్ లబ్ధిదారుల్లో చాలా మంది అర్హత లేని వారు లేదా ఇ-కేవైసీ పూర్తి చేయని వారు ఉన్నట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. దీంతో కేంద్రం అనర్హత జాబితాను రిలీజ్ చేసే పనిలో ఉందని సమాచారం అందుతోంది. ఇంకా సుమారు 3 కోట్ల మంది వరకు ఇ-కేవైసీ పూర్తి చేయలేదని తెలుస్తోంది. దీంతో జూన్ లో రిలీజ్ చేసే పీఎం కిసాన్ రూ.2,000 లను E-KYC పూర్తి చేసిన వారికి మాత్రమే ఇవ్వనుంది.