PM Kisan Yojana : దేశంలోని రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి ఉద్దేశించిన PM Kisan Yojana పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి 24, 2019న ప్రారంభించారు. ఈ పథకం ద్వారా, రెండు హెక్టార్ల వరకు భూమి ఉన్న యజమానులు ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పథకం కింద, సంవత్సరానికి రూ. 6000 సహాయం అందించబడుతుంది. అయితే, ఈ మొత్తాన్ని ఒక్కొక్కటి రూ. 2,000 చొప్పున మూడు విడతలుగా అందజేస్తారు. ఈ పథకం ద్వారా రూ.20,000 కోట్లు పంపిణీ చేయగా, అర్హత ఉన్న రైతులందరికీ రూ.2,000 అందింది. కానీ, ఇప్పుడు రైతులు తమ 19వ విడత కోసం ఎదురు చూస్తున్నారు, ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి 24న బీహార్‌లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క 19వ విడత విడుదల చేయనున్నారు.