ఏపీలోని విశాఖపట్నంలో రూ.2 లక్షల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఏపీ ప్రజల ఆశీర్వాదంతో కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి విషయాన్ని నేను గౌరవిస్తాం.. అలాగే రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాను.. ఏపీ ప్రజల సేవే మా సంకల్పం… సీఎం చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు మేము అండగా ఉంటాం, అభివృద్ధిలో ఏపీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం అని పేర్కొన్నారు. 2047 నాటికి రెండున్నర లక్షల కోట్ల డాలర్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. 2023లో దేశంలో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ను ప్రారంభించాం. 2030 నాటికి మన దేశంలో ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలి అని ప్రధాని మోదీ అన్నారు.