Homeఫ్లాష్ ఫ్లాష్కేజ్రీవాల్​ను ఏసుకున్న ప్రధాని మోదీ.. ఎందుకంటే..

కేజ్రీవాల్​ను ఏసుకున్న ప్రధాని మోదీ.. ఎందుకంటే..

దేశంలో కోవిడ్ పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నాడు పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు.

ఆ సమావేశంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధానికి క్షమాపణలు చెప్పారు.

శుక్రవారం ఉదయం అత్యంత కరోనా ప్రభావిత రాష్ట్ర ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో దిల్లీ సీఎం కేజ్రీవాల్ మాట్లాడడం మొదలుపెట్టగానే దాన్ని లైవ్ ప్రసారం చేయడం ప్రారంభించారు.

దానికి మోదీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ “ఇది మన ప్రోటోకాల్‌కు, సంప్రదాయానికి విరుద్ధం.

ఇన్ హౌస్ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా లైవ్ టెలికాస్ట్ ఇవ్వకూడదు. అది సబబు కాదు.

మనం ఎప్పుడూ ప్రోటోకాల్ పాటించాలి” అని అన్నారు. మోదీ వ్యాఖ్యలకు కేజ్రీవాల్ ఇబ్బంది పడుతూ, “సరే సార్, ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటాను.

నేనేమైనా కఠినంగా మాట్లాడితే, నావల్ల ఏదైనా పొరపాటు జరిగితే అందుకు నేను క్షమాపణలు కోరుకుంటున్నాను” అని అన్నారు.

కేజ్రీవాల్ తన ప్రసంగంలో కరోనా జాతీయ ప్రణాళిక గురించి మాట్లాడారు.

ఆక్సిజన్ కొరత గురించి, ఆక్సిజన్ ట్యాంకర్లను ఆపివేయడం గురించి మాట్లాడారు. దీనిపై ప్రధాని స్పందించాలని కోరారు.

ఈ మీటింగ్ లైవ్ వెళ్లి ఉండకూడదని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. కేజ్రీవాల్ రాజకీయాలు చేస్తున్నారని వారు ఆరోపించారు.

కేజ్రీవాల్ తన ప్రసంగంలో ఆక్సిజన్ ఎయిర్‌లిఫ్టింగ్ చేయాలని సూచించారు. అయితే, అది ఇప్పటికే జరుగుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రులందరూ వారి వారి ప్రణాళికలను వివరించారు. కేజ్రీవాల్ తాను ఏం చేస్తున్నారో చెప్పలేదని వారు ఆరోపించారు.

ఈ సమావేశం ప్రత్యక్ష ప్రసారం చేయడం గురించి కేంద్రం నుంచి తమకు ఎటువంటి సూచనలు అందలేదని, అందుకే లైవ్ ప్రసారం చేశామని, అసౌకర్యానికి చింతిస్తున్నామని దిల్లీ సీఎంఓ తెలిపింది.

ఆక్సిజన్ సరఫరా విషయమై కేంద్రానికి, దిల్లీ ప్రభుత్వానికి మధ్య వివాదాలు నెలకొన్నాయి.

అంతకుముందు, కేంద్రం తమకు అందవలసిన ఆక్సిజన్ కోటా అందించలేదని కేజ్రీవాల్ ఆరోపించారు. తరువాత, కేంద్రం దిల్లీకి ఇవ్వాల్సిన వాటాను విడుదల చేసింది.

అయితే, పలు చోట్ల ఆక్సిజన్ ట్యాంకర్లను అడ్డుకున్నారని దిల్లీ ప్రభుత్వం చెబుతోంది.దిల్లీలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉంది.

ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని మోదీ ఏం చెప్పారంటే…

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కోవిడ్ ప్రభావిత రాష్ట్రాలకు పూర్తి సహాయం అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

అవసరమైన ఇంజెక్షన్లు, మందుల బ్లాక్ మార్కెట్ నిల్వలను నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

రైల్వే, వైమానిక దళాల సహాయంతో రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

“మనమందరం ఒక దేశంగా పని చేస్తే వనరుల కొరత ఉండదు” అని మోదీ అన్నారు.

ఆస్పత్రుల భద్రత విస్మరించవద్దని, భయంతో మందులు కొని ఇంట్లో నిల్వ చేసుకోకూడదనే అవగాహన ప్రజల్లో కలిగించాలని కోరారు.

మందులు, ఆక్సిజన్ విషయంలో అన్ని రాష్ట్రాలు కలిసి పనిచేయాలని, రాష్ట్రాలకు వెళ్లే ఆక్సిజన్ ట్యాంకర్లనూ ఎవరూ ఆపకుండా చూసుకోవాలని అన్నారు.

Recent

- Advertisment -spot_img