వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆయన భార్య మెలానియాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ట్రంప్ సలహాదారుల్లో ఒకరికి కరోనా సోకడంతో వీరు పరీక్షలు చేయించుకున్నారు.
కరోనా పాజిటివ్ రావడంతో క్వారంటైన్‌లోకి వెళ్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
అమరికా ఎన్నికల్లో తనకు సలహాదారుగా సేవలందిస్తున్న హోప్ హిక్స్ కొవిడ్-19 బారీన పడ్డారు.
దీంతో ట్రంప్ సైతం కరోనా బారీన పడటంతో మరో నెల రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయోనని ఆసక్తి నెలకొంది.
ప్రెసిడెంట్గా బాధ్యతలను ఏ అంతరాయం లేకుండా నిర్వహిస్తానని ట్రంప్ ప్రకటించినా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదు.
ఇదే అవకాశంగా ఆయన ప్రత్యర్థి బైడెన్ తనకు అనుకూలంగా మలుచుకునే వీలుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ట్రంప్, ఆయన సతీమణి త్వరగా కోలుకుని, పూర్తి ఆరోగ్యవంతులు కావాలని ట్విటర్లో ఆకాంక్షించారు.
Wishing my friend @POTUS @realDonaldTrump and @FLOTUS a quick recovery and good health. https://t.co/f3AOOHLpaQ
— Narendra Modi (@narendramodi) October 2, 2020
US President Donald Trump and his wife Melania got a corona positive.