ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనలో భాగంగా ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోంది. దీని కింద కుట్టు మిషన్ కొనేందుకు కేంద్రం రూ.15,000 డబ్బును నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌లో వేస్తుంది. తద్వారా మీరు కుట్టు పని చేస్తూ, ఉపాధి పొందుతూ సంపాదించుకోవచ్చు. కేంద్రం అదనంగా రూ.20 వేల వరకు రుణం కూడా ఇస్తోంది. ఈ డబ్బుతో కుట్టు మిషన్ షాపు పెట్టుకోవచ్చు. మహిళలే కాదు పురుషులు కూడా ఈ పథకానికి అర్హులు.
ఎలా దరఖాస్తు చేయాలంటే..
ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://pmvishwakarma.gov.in/Login లోకి వెళ్లాలి. అక్కడ మొబైల్ నంబర్, కాప్చా కోడ్ (captcha code) ఎంటర్ చెయ్యాలి. తర్వాత ఆధార్ నంబర్ ఇవ్వాలి. అప్పుడు మీకు ఓ రిజిస్ట్రేషన్ ఫారమ్ వస్తుంది. దాన్ని నింపి, సబ్‌మిట్ కొట్టాలి. తర్వాత మీకు డిజిటల్ రూపంలో ట్రైనింగ్ ఇస్తారు. అలాగే విశ్వకర్మ డిజిటల్ ఐడీ, సర్టిఫికెట్ ఇస్తారు. తర్వాత మీరు రూ.15000 పొందడం, రుణం పొందడం వంటివి చేసుకోవచ్చు.