ఇదే నిజం జగిత్యాల టౌన్ : శాంతి భద్రతల దృష్ట్యా 30 రోజులు (ఏప్రిల్ 1వ తేది నుండి 30 వరకు) జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు . శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలను సహించబోమని హెచ్చరించారు. ప్రజలు సహకారించాలని కోరారు.