Homeహైదరాబాద్latest Newsపేకాట స్థావరం పై పోలీసుల దాడి.. భారీగా నగదు స్వాధీనం.. పట్టుబడ్డ ఏడుగురు.. ఇద్దరు పరారీ

పేకాట స్థావరం పై పోలీసుల దాడి.. భారీగా నగదు స్వాధీనం.. పట్టుబడ్డ ఏడుగురు.. ఇద్దరు పరారీ

ఇదే నిజం,పెద్దపల్లి: రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ రామగుండం పోలీస్ స్టేషన్ పరిధి ప్రాంతంలో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్,ఎస్ఐ రవి ప్రసాద్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రాజేందర్, మహేందర్, కానిస్టేబుల్ ప్రకాష్, అఖిల్, మల్లేష్, రాజేందర్, సునీల్ లతో కలిసి రైడ్ చేయగా ఏడుగురిని పట్టుకున్నారు. మరో ఇద్దరు పారిపోవడం జరిగింది. పట్టుబడిన వారి వద్ద నుండి రూ.17,200 నగదు,04 మొబైల్స్,02 బైక్‌లు,01 ఆటో ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులను మరియు స్వాధీనం చేసుకున్న నగదు,సెల్ ఫోన్లు,ద్విచక్ర వాహనం,ఆటో మరియు పెకముక్కలను తదుపరి విచారణ నిమిత్తం రామగుండం పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది.

Recent

- Advertisment -spot_img