Homeతెలంగాణతీన్మార్ మల్లన్నపై కేసు నమోదు

తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు

హైదరాబాద్ లోని సీతాఫల్ మండి ప్రాంతంలో మారుతి సేవా సమితి పేరుతో జ్యోతిష్యాలయం నిర్వహిస్తున్న లక్ష్మీకాంత శర్మ  ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు క్యూ టీవీ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పై కేసు నమోదు చేశారు.

దాదాపు వారం క్రితం తనకు ఫోన్ చేసిన తీన్మార్ మల్లన్న, రూ. 30 లక్షలు తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేశారని, తాను ఇవ్వకపోవడంతో మరుసటి రోజు నుంచి తన చానెల్ లో అవాస్తవ కథనాలను ప్రసారం చేశారని లక్ష్మీకాంత శర్మ ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు తమకు 22న లిఖిత పూర్వక ఫిర్యాదు అందిందని, కేసును దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img