Homeహైదరాబాద్కరోనాను జయించి మరొకరికి ప్లాస్మాను దానం చేసిన కానిస్టేబుల్

కరోనాను జయించి మరొకరికి ప్లాస్మాను దానం చేసిన కానిస్టేబుల్

సరూర్ నగర్ పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ సుధీర్ కుమార్​కు గత నెల కరోన పాజిటివ్ రాగా ఇటీవలే కరోన నుంచి కోలుకొని తిరిగి విధుల్లో చేరాడు. రాచకొండ కమీషనర్ మహేశ్ భగవత్, జాయింట్ కమీషనర్ సుదీర్ బాబు సూచన మేరకు సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్​లో కరోన చికిత్స పొందుతున్న మునిరాజ కుమార్ (59) అను వ్యక్తికి ప్లాస్మా అవసరం కావడంతో సుధీర్ కుమార్ స్వచ్చందంగా ముందుకు వచ్చి హాస్పిటల్​కు వెళ్ళి మునిరాజ కుమార్​కు ప్లాస్మా దానం చేయడం జరిగింది. కానిస్టేబుల్​గా విధుల్లో ప్రజలకు రక్షణ కల్పించడమే కాకుండా ప్లాస్మా దానం చేసి మరొకరి ప్రాణాలకు రక్షణగా నిలవడం పై పలువురు అభినందిస్తున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img