Homeహైదరాబాద్latest Newsశాంతి భద్రతల రక్షణ పోలీస్ బాధ్యత: మంచిర్యాల డీసీపీ భాస్కర్

శాంతి భద్రతల రక్షణ పోలీస్ బాధ్యత: మంచిర్యాల డీసీపీ భాస్కర్

ఇదేనిజం, లక్షెట్టిపేట : శాంతిభద్రతలు రక్షణ పోలీస్ బాధ్యత అని మంచిర్యాల డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు. గురువారం అయన లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ ను సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా డీసీపీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్కి వచ్చే పిర్యాదు దారులతో మర్యాదపూర్వకంగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం స్టేషన్ పరిసరాలు, సిబ్బంది క్వాటర్స్ పరిశీలించారు. సిబ్బంది పనితీరు, పోలీస్ స్టేషన్ పరిసరాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బందికి పలు సలహాలు, సూచనలు అందజేశారు. మంచిర్యాల డీసీపీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి లక్షెట్టిపేట వచ్చిన డీసీపీకి ఎస్సై చంద్రకుమార్ పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. డీసీపీ వెంట మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సిఐ నరేందర్,ఎస్సై చంద్రకుమార్, రెండో ఎస్సై థానాజీ ఉన్నారు.

Recent

- Advertisment -spot_img