ఇదే నిజం జనవరి 6 బెల్లంపల్లి : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జోన్ దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాత తిరుమలాపూర్ రొట్టపల్లి గ్రామంలో రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ ఉత్తర్వుల ప్రకారం దేవాపూర్ పోలీసువారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదివాసీ గిరిజన కుటుంబాలకు, నిత్యావసర సరుకులు, దుప్పట్ట్లు పంపిణీ, వారితో సంపక్తి భోజనం పోలీస్ మీకోసం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమానికి నిర్వహించారు, ముఖ్యఅతిథిగా బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ హాజరైయారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, ప్రజా శ్రేయస్సే పోలీసుల ద్యేయం తెలిపారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఎన్నో సౌకర్యాలు మెరుగు పడ్డాయని తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలను చక్కగా చదివించుకుని ప్రభుత్వం ప్రవేశపెట్టిన సౌకర్యాలను సద్వినియొగం చేసుకోవాలన్నారు.
గిరిజనుల శ్రేయస్సు కోసం పోలీస్ శాఖ ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటుందని తమ పిల్లలు చదువుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటుందని అదేవిధంగా ఆదివాసి గిరిజనుల పిల్లలు కూడా ఉన్నత విద్యనభ్యసించాలి అన్నారు. ప్రభుత్వం అందించే వివిధ లబ్ధి కార్యక్రమాలను గిరిజనులకు చేర వేయడానికి పోలీస్ శాఖ ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో సంసిద్ధంగా ఉందని తెలిపారు. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని సంఘ విద్రోహ శక్తులు వీరిని ప్రలోభాలకు గురిచేసి వీరిని చెడు మార్గం వైపు నడిచేలా ప్రోత్సహిస్తారు కావున వారి ప్రలోభాలకు లొంగకుండా మంచిని ఎంచుకుని సమాజ శ్రేయస్సుకు పాటు పడాలని సూచించారు. ఎటువంటి కష్టం వచ్చినా ఎల్లవేళలా పోలీస్ శాఖ వారికి అందుబాటులో ఉంటుందని వారు పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఆదివాసులు అసాంఘిక శక్తులకు దూరముగా ఉండాలని, గ్రామాలలో ఎవరైనా అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు కనిపించిన, పోలిసులకు తెలియచేయాలని అభివృద్ధివైపు అదివాసులు దృష్టిసారించాలని సూచించారు.ఈ కార్యక్రమం లో బెల్లంపల్లి ఏసిపి రవి కుమార్, మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, దేవాపూర్ ఎస్సై ఆంజనేయులు, ఒరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది,ప్రజలు, కుల పెద్దలు పాల్గొన్నారు.