Homeహైదరాబాద్latest Newsడంగల్, లగచర్ల వెళ్తున్న డీకే అరుణను అడ్డుకున్న పోలీసులు

డంగల్, లగచర్ల వెళ్తున్న డీకే అరుణను అడ్డుకున్న పోలీసులు

లగచర్ల ఘటనపై బీజేపీ రాజ్యసభ సభ్యురాలు డీకే అరుణ స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. లగచర్ల ఘటనలో కుట్ర జరిగితే ఇంటెలిజెన్స్ ఏం చేసింది అని ప్రశ్నించారు. ఫార్మా కంపెనీ స్థాపనపై గ్రామస్తుల్లో వ్యతిరేకత వస్తే కలెక్టర్ కు ప్రభుత్వం భద్రత కల్పించలేదని ఆమె విమర్శించారు.
ఈ నేపథ్యంలో డంగల్, లగచర్ల వెళ్తున్న బీజేపీ ఎంపీ డీకే అరుణను మన్నెగూడ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీగా తాను తన నియోజకవర్గంలో తిరిగే హక్కు లేదా అని ఆమె ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డిని ఎలా పంపించారు.. నన్ను ఎందుకు పంపడం లేదు అని నిలదీశారు. తిరుపతి రెడ్డి కనీసం ఒక వార్డ్ మెంబర్ కూడా కాదు అతనికి ఎస్కార్ట్ ఇచ్చి పంపించారంటూ పోలీసులపై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై ఎంపీ డీకే అరుణ బైఠాయించారు. దీంతో మన్నెగూడ వద్ద ఉద్రిక్తత వాతవరణం నెలకొంది.

Recent

- Advertisment -spot_img