న్యూ ఇయర్ వేడుకలపై ముందెన్నడు లేని రీతిలో ఈ దఫా పోలీస్‌శాఖ ప్రత్యేక నిఘా వేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యాలను నిర్ధేశించిన నేపథ్యంలో.. పోలీస్‌శాఖలోని అన్ని విభాగాలు న్యూ ఇయర్ వేడుకలపై ఫోకస్ చేశాయి. నగరంతోపాటు శివారులలో, జిల్లాల్లోని ముఖ్యనగరాల్లో, ఫామ్ హౌస్‌లు, బార్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, హోటళ్లపై పోలీస్‌శాఖ ఓ కన్నేసి పెట్టింది.