Homeహైదరాబాద్latest Newsహమీలు అమలు చేస్తే రాజకీయ సన్యాసం.. కాంగ్రెస్ సర్కారుకు సవాల్​ విసిరిన ఈటల రాజేందర్..

హమీలు అమలు చేస్తే రాజకీయ సన్యాసం.. కాంగ్రెస్ సర్కారుకు సవాల్​ విసిరిన ఈటల రాజేందర్..

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు అమలు చేయడం లేదని బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన సవాల్​ విసిరారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. డిక్లరేషన్ల పేరుతో ఎన్నికల సమయంలో హడావుడి చేసిన కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పుడు హామీల అమలును గాలికి వదిలేసిందన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా హామీలను నిలబెట్టుకోలేదన్నారు. 6 నెలల కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో ఒక్క ఉద్యోగం అయినా వచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు. జాబ్‌ క్యాలెండర్‌ ఏమైందని నిలదీశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఈటల ఆరోపించారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న పార్టీలకు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. నోటుతో ఓటును కొనాలని చూసేవారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

Recent

- Advertisment -spot_img