– మట్టిపెళ్లతో దాడిచేసి మతిస్థిమితం లేని వ్యక్తి
ఇదేనిజం, అచ్చంపేట: బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్పై మరోసారి దాడి జరిగింది. శనివారం రాత్రి ఆయన మీద దాడి జరిగిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు. కాగా తాజాగా మరోసారి దాడి జరగడం గమనార్హం. సోమవారం ఆయన అమ్రబాద్ మండలం కుమొరోనిపల్లిలో ప్రచారం నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి మట్టి పెళ్లతో దాడి చేశాడు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కాగా సదరు వ్యక్తి కి మతిస్థిమితం లేదని సమాచారం. నిందితుణ్ని పర్వతాలుగా పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్యే గువ్వలపై కొన్ని రోజుల వ్యవధిలోనే రెండు సార్లు దాడులు జరగడం గమనార్హం.