HomeరాజకీయాలుPolitics : Revanth met with Kodandaram Politics : కోదండరాంతో రేవంత్​...

Politics : Revanth met with Kodandaram Politics : కోదండరాంతో రేవంత్​ భేటీ

– మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి
– ప్రభుత్వం ఏర్పడ్డాక సముచిత పదవి ఇస్తామని హామీ

ఇదేనిజం, హైదరాబాద్​: టీజేఎస్​ అధినేత కోదండరాంతో పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాడ్డక సముచిత పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. చాలా రోజులుగా టీజేఎస్.. కాంగ్రెస్​ కలిసి పోటీ చేయబోతున్నాయని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే టీజేఎస్​ కు కాంగ్రెస్​ పార్టీ టికెట్లు ఏమీ కేటాయించలేదు. కోదండరామ్​ లేదా ఆయన పార్టీ నేతలు పోటీ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని .. కాంగ్రెస్​ పార్టీ భావిస్తోంది. అందుకే కోదండరామ్​ ను మద్దతు ఇవ్వాలని రేవంత్​ కోరారు. సోమవారం ఉదయం నాంపల్లిలోని టీజేఎస్ ఆఫీస్‌కు చేరుకున్న రేవంత్, కర్ణాటక మంత్రి బోసురాజు.. కోదండరాంను కలిశారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు తెలపాలని ఈ సందర్భంగా కోదండరాంను రేవంత్ కోరనున్నారు. కలిసి పనిచేద్దామని ఇప్పటికే ఇరు పార్టీలు అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌తో భేటీ అయి కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి కోదండరాం అంగీకరించినట్టు సమాచారం.

Recent

- Advertisment -spot_img