Homeజాతీయంరాజస్థాన్ లో కొనసాగుతున్న పోలింగ్

రాజస్థాన్ లో కొనసాగుతున్న పోలింగ్

  • 199 సెగ్మెంట్లకు ఒకేసారి పోలింగ్
  • పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన జనం
  • ఓటేసిన ప్రముఖలు

ఇదేనిజం, నేషనల్ బ్యూరో: రాజస్థాన్ లో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మొత్తం 199 నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి చనిపోవడంతో ఒక నియోజకవర్గానికి పోలింగ్ వాయిదా పడింది. ఉదయం 12 గంటల వరకు దాదాపు 11 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సచిన్‌ పైలట్ జైపుర్‌లోని సివిల్‌ లైన్స్‌ ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ తూర్పు బికనేర్‌లో ఓటేశారు. క్యూలైన్‌లో నిల్చుని ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. భాజపా ఎంపీ రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాఠోడ్‌ జైపుర్‌లో ఓటేశారు.కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్‌ షెకావత్‌ జోధ్‌పుర్‌లో, కైలాశ్‌ చౌధరీ బర్మేర్‌లో ఓటు వేశారు.మాజీ సీఎం వసుంధరా రాజే ఝలావర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఎంపీలు సుభాష్‌ చంద్ర బహేరియా, విద్యాధర్‌ నగర్‌ అభ్యర్థి దియా కుమారి జైపుర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Recent

- Advertisment -spot_img