HomeతెలంగాణPolling on 30 November నవంబర్​ 30న పోలింగ్​

Polling on 30 November నవంబర్​ 30న పోలింగ్​

– డిసెంబర్​ 3న కౌంటింగ్​
– నవంబర్​ 3న నోటిఫికేషన్
– 10 నుంచి నామినేషన్ల స్వీకరణ
– 15 లోపు విత్​ డ్రాకు చాన్స్​
– ఒకే విడతలో తెలంగాణలో ఎలక్షన్స్​
– ఎన్నికల షెడ్యూల్​ విడుదల
– రాష్ట్రంలో అమల్లోకి కోడ్​

ఇదేనిజం, నేషనల్​ బ్యూరో: నవంబర్​ 30 తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు సోమవారం ఎన్నికల షెడ్యూల్​ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్​ విడుదల చేసింది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో కోడ్​ అమల్లోకి వచ్చింది. తెలంగాణతో సహా మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మిజోరం రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 679 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణలో 3.17కోట్లు, రాజస్థాన్‌లో 5.25కోట్లు, మధ్యప్రదేశ్‌లో 5.6 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 2.03కోట్లు, మిజోరంలో 8.52లక్షల ఓటర్లున్నారు. తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలుండగా.. మధ్యప్రదేశ్‌ లో 230, రాజస్థాన్‌లో 200, ఛత్తీస్‌గఢ్‌లో 90, మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. ‘ఎన్నికల కోసం ఆరు నెలలుగా కసరత్తు చేస్తున్నాం. వివిధ రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించాం. ఐదు రాష్ట్రాల అధికారులు, పార్టీల నేతలతో చర్చలు జరిపాం. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 679 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో 60 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు పొందారు. అన్ని రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగింది. మిజోరం, ఛత్తీస్‌గడ్‌లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. ఈ ఎన్నికల్లో వృద్ధులకు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పించాం. ఐదు రాష్ట్రాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది’ అని రాజీవ్ కుమార్ మీడియాకు వెల్లడించారు.

ఎన్నికలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇవే..

నోటిఫికేషన్ తేదీ: నవంబరు 3
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: నవంబరు 10
నామినేషన్ల పరిశీలన తేదీ: నవంబరు 13
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: నవంబరు 15
పోలింగ్‌ తేదీ: నవంబరు 30
ఓట్ల లెక్కింపు తేదీ: డిసెంబరు 3

తెలంగాణలో ఓటర్ల సంఖ్య
తెలంగాణలో జెండర్ రేషియో : 998
ఓటర్ల సంఖ్య : 3.17,17,389 మంది
పోలింగ్ కేంద్రాల సంఖ్య : 35,356
18-19 ఏళ్ల వయస్సు ఓటర్లు : 3,35,043 మంది
కొత్త ఓటర్లు : 17,01,087 మంది
తొలగించిన ఓట్లు : 6,10,694 మంది

Recent

- Advertisment -spot_img