Homeవిద్య & ఉద్యోగంపాలీసెట్ ఫలితాలు 9న, 12నుంచి ప్ర‌వేశాల షెడ్యూల్‌

పాలీసెట్ ఫలితాలు 9న, 12నుంచి ప్ర‌వేశాల షెడ్యూల్‌

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ‘పాలీసెట్‌’ ఫలితాలు ఈనెల 9న విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో తరగతుల ప్రారంభానికి సంబంధించిన షెడ్యూలును సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ సోమవారం విడుదల చేశారు. అక్టోబరు 8న ప్రైవేట్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.
మొద‌టి విడ‌త ప్ర‌వేశాల‌కు సంబంధించిన షెడ్యూల్ ఇలా ఉంది.

  • ధ్రువపత్రాల పరిశీలనకు 12వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి.
  • 14 నుంచి 18వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలనను చేప‌డ‌తారు.
  • ధ్రువపత్రాల ప‌రిశీల‌న పూర్తైన వారు 14 నుంచి 20 వరకు వెబ్ ఆప్షన్‌ల‌ను న‌మోదు చేయాలి.
  • 22నుంచి సీట్ల కేటాయింపు జరగనుంది.
    పాలిసెట్ తుది విడత ప్రవేశాల షెడ్యూల్‌
  • ఈ నెల 30 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది.
  • 30వ తేదీన, అక్టోబరు 1న వెబ్ ఆప్షన్లు న‌మోదు చేయాలి.
  • అక్టోబరు 3న తుది విడత ప్రవేశాలకు సీట్లు కేటాయింపు చేస్తారు.
  • అక్టోబరు 7 నుంచి అకాడ‌మిక్ ఇయ‌ర్, అక్టోబరు15 నుంచి తరగతులు ప్రారంభం.
RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img