తొలి దశ ఓటింగ్ ముగిసిన తర్వాత మోడీకి వణుకు పుడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆస్తులు పంచుతామని మోదీ అనడం బాధాకరమని ఆయన అన్నారు. ప్రధాని స్థాయిలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించాల్సిన మోదీ నీచంగా మాట్లాడుతున్నారు. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా పాలన సాగించాం. గ. గతంలో మన్మోహన్ సింగ్ మాట్లాడిన వీడియోను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని ఆయన అన్నారు.