త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్ గురించి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ టోర్నీలో టీమిండియా పేస్ బౌలర్, యార్కర్లతో హడలెత్తించే డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా చెలరేగుతాడని అశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ సీజన్‌లో టాప్ 3 లో నిలిచిన బుమ్రా వరల్డ్ కప్‌లోనూ విధ్వంసం సృష్టిస్తాడని పేర్కొన్నాడు. అత్యధిక వికెట్లు తీసి తన మార్క్ కనబరుస్తాడని అన్నాడు. అంతే గాక బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ సిక్సర్ల మోత మోగిస్తాడని చెప్పాడు. పరుగుల వరద పారించి ప్రేక్షకులను అలరిస్తాడని అన్నాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసే ఆటగాడిగా ట్రావిస్ హెడ్ లీడ్‌లో ఉన్నాడని అన్నాడు.