రెండేళ్ల క్రితం వరకూ తెలుగులో తిరుగులేని స్టార్ డమ్ ఆస్వాదించింది పూజా హెగ్డే. ఏ క్రేజీ సినిమా చూసినా.. కథానాయికగా ఆమె పేరే. యువ హీరోలతో పాటు, అగ్ర కథానాయకులతోనూ జోడీ కట్టింది. అయితే సడన్‌గా… పూజా కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. అవకాశాలు చేజారిపోయాయి. ఫ్లాపులు వరుసకట్టాయి. చేస్తున్న సినిమాల్లోంచి కూడా డ్రాప్ అయ్యింది. ‘గుంటూరు కారం’ చిత్రం నుంచి సడన్ గా తప్పుకొంది. కొంతకాలం పూజా పేరు కనిపించలేదు. వినిపించలేదు. తెలుగులో ఆమెకు ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది.
తాజాగా పూజా హెగ్దేకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూజాగా హెగ్డే కారులో వెళ్తుండగా ఆమెతో పాటు మరో వ్యక్తి దర్శనం ఇచ్చాడు. పూజా పక్కన ఉన్న వ్యక్తి హ్యాండ్స్‌మ్‌గా ఉండటంతో అతను ఎవరా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. కెమెరాలో తమను ఫొటోలు, వీడియోలు తీస్తున్నారని తెలియడంతో పూజా హెగ్డే తన మొహాన్ని అడ్డుపెట్టుకునే ప్రయత్నం చేసింది. అప్పటికే ఆమె ఫేస్ క్లియర్‌గా కనిపించడంతో.. చేసేది లేక సైలెంట్ అయిపోయింది. పూజా హెగ్దేతో ఉన్న వ్యక్తి.. ఫ్రెండా లేదా బాయ్ ఫ్రెండా లేదా ఆమెకు ఏదైనా రిలేషన్ ఆ అంటూ కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
అయితే దీనిపై పూజా రియాక్ట్ అవకపోవడంతో..అతనితో బుట్టబొమ్మ రిలేషన్‌లో ఉందని ఉన్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా పూజా హెగ్డే ముంబైలోనే మకాం వేసింది. అక్కడ సినిమాల్లో ఆఫర్ల కోసం వేచి చూస్తోంది. ఓ బాలీవుడ్ సినిమాలో పూజా హెగ్డెకు అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పూజా హెగ్డేతో ఉన్న మిస్టరీ మ్యాన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.