పూజా హెగ్డే బాలీవుడ్ హీరో అహాన్ శెట్టి సరసన ‘సంకీ’ చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీని అద్నాన్ షేక్, యాసిర్ ఝా సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ మొదలు పెట్టినట్లు తెలిపింది చిత్రబృందం. ప్రేమకథా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అహాన్, పూజ మధ్య కెమిస్ట్రీ సినిమాకే ప్రధాన ఆకర్షణగా ఉండబోతుందట. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేమికుల రోజున విడుదలకు సిద్ధమవుతోంది.