Homeఫ్లాష్ ఫ్లాష్నాగ చైతన్యకు జోడీగా పూజా హెగ్డే..?

నాగ చైతన్యకు జోడీగా పూజా హెగ్డే..?

చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన భారీ చిత్రం “తాండల్”. ఈ ఏడాది డిసెంబర్ 20న ఈ సినిమా విడుదల కానుంది. అయితే చైతూ విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు తో మరో ప్రాజెక్ట్ చెయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. అయితే ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా పూజా హెగ్డే నటిస్తోందని తెలుస్తోంది. కాకపోతే పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) నిర్మించనుంది.

Recent

- Advertisment -spot_img