Pooja Hegde : ‘ఆర్ ఆర్ ఆర్’ చూడటానికి వెయిటింగ్
Pooja Hegde – రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలకు ముస్తాబవుతోంది.
భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా, జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.
అంతకంతకూ అంచనాలు పెంచుతున్నాయి.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిన్న ఉదయం ఎన్టీఆర్ పోస్టర్ ను .. సాయంత్రం చరణ్ పోస్టర్ ను వదిలారు.
కొమరం భీమ్ గా ఎన్టీఆర్ .. అల్లూరిగా చరణ్ పోస్టర్లు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి పూజ హెగ్డే స్పందించింది.
మామూలు ప్రేక్షకుల మాదిరిగానే రాజమౌళి ఎమోషనల్ డ్రైవ్ ను చూడటానికి ఆసక్తితో ఉన్నానని చెప్పింది.
ఎన్టీఆర్ .. చరణ్ ఇద్దరూ కూడా చాలా ఫెంటాస్టిక్ గా కనిపిస్తున్నారనీ, ఒకే స్క్రీన్ పై వాళ్లిద్దరినీ చూడటానికి తాను చాలా ఆత్రుతతో ఉన్నానని అంది.
ఎన్టీఆర్ సరసన నాయికగా ‘అరవింద సమేత’తో హిట్ అందుకున్న పూజ, చరణ్ జోడీగా ‘ఆచార్య’ సినిమా చేసిన సంగతి తెలిసిందే.
ఫిబ్రవరి 4వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవి కూడా చదవండి
తన కలను నిజం చేసుకుంటున్న పూజా హెగ్డే