Homeహైదరాబాద్latest NewsPosani Krishna Murali : పోసాని కృష్ణమురళికి భారీ ఊరట.. బెయిల్ మంజూరు

Posani Krishna Murali : పోసాని కృష్ణమురళికి భారీ ఊరట.. బెయిల్ మంజూరు

Posani Krishna Murali : ప్రముఖ నటుడు, రాజకీయనేత పోసాని కృష్ణ మురళికి (Posani Krishna Murali) మంగళవారం బెయిల్ మంజూరు అయింది. కర్నూలు జెఎఫ్ మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 5వ తేదీ నుండి పోసాని కృష్ణ మురళి కర్నూలు జిల్లా జైలులో ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పోసాని కృష్ణ మురళిపై నవంబర్ 14, 2024న కేసు నమోదైంది. ఆదోని, విజయవాడ కోర్టుల్లో పోసానికి బెయిల్ మంజూరు అయింది. ఇప్పటికే పోసానికి రాజంపేట, నరసరావుపేటలో బెయిల్ చేయగా మొత్తం నాలుగు కేసుల్లో పోసానికి బెయిల్‌ మంజూరు చేసింది. ఇతర కేసుల్లో BNS చట్టం కింద..పోసానికి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం కర్నూలు జైలులో ఉన్న పోసాని కృష్ణమురళి రేపు జైలు నుంచి పోసాని విడుదలయ్యే అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img