Post Office: సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ద్వారా ప్రతి నెలా సాధారణ ఆదాయంతో మంచి మొత్తంలో వడ్డీని పొందవచ్చు. ఈ స్కీమ్లో రూ.1000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. 8.2% వడ్డీ రేటుతో రూ.30 లక్షలు పెడితే సంవత్సరానికి రూ.2.46 లక్షలు, నెలకు రూ.20,000 వడ్డీ వస్తుంది. సెక్షన్ 80C కింద ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. వివరాలకు మీ దగ్గర్లోని పోస్టాఫీసును సంప్రదించండి.