Post office : ఈరోజుల్లో చాలా మంది పెద్ద ఎత్తున పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటున్నారు. దేశంలోని ప్రతి ఒక్కరి కోసం కేంద్ర ప్రభుత్వం బ్యాంకులు మరియు పోస్టాఫీసులలో (Post office) అనేక పొదుపు పథకాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా పోస్టాఫీసులలో ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు అనేక పొదుపు పథకాలు అమలు చేయబడుతున్నాయి. ఈ క్రమంలో పోస్టాఫీసు బెస్ట్ స్కీమ్ అందిస్తుంది. ఈ స్కీమ్ ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి ఉంది. మీరు వ్యక్తిగత ఖాతాలో తొమ్మిది లక్షల రూపాయల వరకు మరియు ఉమ్మడి ఖాతాలో 15 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. వార్షిక వడ్డీ రేటు 7.4 శాతం. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన తర్వాత, నెలకు రూ. 5,500 ఆదాయం వినియోగదారుడి పోస్టాఫీసు పొదుపు ఖాతాలో జమ చేయబడుతుంది. ఈ పథకం ముగింపులో, లబ్ధిదారులకు 3 లక్షల 30 వేల రూపాయలు వడ్డీగా లభిస్తుంది.