ఏపీలో పోస్టల్ బ్యాలెట్ వివాదం ముదురుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 5 లక్షల వరకూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. ప్రతి పోస్టల్ బ్యాలెట్‌పై ఆర్వోలు సంతకం చేయాల్సి ఉండగా, కొందరు చేయలేదు. దీంతో ఆర్వో సంతకం లేకపోయినా, ఆర్వో సీల్ లేకపోయినా వాటిని కూడా లెక్కించాలని కోరుతూ ఎన్డీఏ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. సానుకూలంగా స్పందించిన ఈసీ.. ఆర్వో సంతకం, సీల్ లేని వాటిని కూడా లెక్కించాలని ఆదేశాలిచ్చింది. దీనిపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.