ఇదేనిజం, ధర్మపురి: జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం చిల్వ కోడూరు గ్రామ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పనిచేసే దూడ నల్ల పోచయ్య అదే గ్రామానికి చెందిన పలువురు వ్యక్తుల నుంచి తమ ఖాతాలో డబ్బులు జమ చేస్తానని నమ్మచెప్పి డబ్బులు జమ చేయకుండా వారి వద్ద నుండి 11,62,000/- తీసుకొని ప్రజలను మోసం చేశాడు.ఈ విషయంపై జీ.వేణు(అసిస్టెంట్ సూపర్డెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ జగిత్యాల సబ్ డివిజన్) ఇచ్చిన ఫిర్యాదు మేరకు గొల్లపల్లి ఎస్సై సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.