ఇదే నిజం, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పోతగల్ మండలం రెవెన్యూ శాఖలో వీఆర్ఏలుగా కొనసాగుతున్న వారి వయస్సు 61 ఏళ్లు దాటితే వారి స్థానంలో తమ వారసులను రెగ్యులర్ చేయాలని కోరుతూ పోతాంగల్ మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో బుధవారం తాసిల్దార్ మల్లయ్యకు వినతి పత్రం అందజేశారు. వీఆర్ఏల వారసులకు జీవో నెంబర్ 81,85 ప్రకారం నియామక ఉత్తర్వులు ఇప్పించి మా కుటుంబాలని ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల వీఆర్ఏ సంఘ అధ్యక్షుడు పంజా నర్సింలు, ఉపాధ్యక్షుడు హన్మంతు, ఎస్.కె మహబూబ్, పీరయ్య, పోశెట్టి, షేక్ అహ్మద్, వీరేశం, అక్బర్, తదితరులున్నారు.