Homeతెలంగాణఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లు

ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లు

• ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి
హైదరాబాద్: కరోనా పాజిటివ్ ఉన్న స్టూడెంట్స్ నిర్భయంగా ఎంసెట్ ఎంట్రన్స్ రాయవచ్చని ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. వీరి కోసం ఎంసెట్ పరీక్ష చివరి రోజును కేటాయించి అవకాశం కల్పిస్తామన్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఎగ్జామ్ సెంటర్ లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే దీనికోసం విద్యార్ధులు ముందుగానే ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇందులో డ్యూటీ చేసే ఎగ్జామినర్ లకు పీపీఈ కిట్లను అందించనున్నట్లు చెప్పారు. ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షను సెప్టెంబర్ 9, 10, 11, 14వ తేదీలలో అగ్రికల్చర్ విభాగం పరీక్షను మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img