Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ”రాజాసాబ్”, ”ఫౌజీ”, ”సాలార్ 2”, ”కల్కి 2”, ”స్పిరిట్” ఇలా వరుస సినిమా రెడీగా ఉన్నాయి. అయితే ప్రభాస్ మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. ఇటీవలే ప్రభాస్ ఆరోగ్యా పరిస్థితి పై కొన్ని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ఆరోగ్యం బాగోలేదు అని.. ప్రస్తుతం ఇటలీలో చికిత్స తీసుకుంటున్నాడు అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ప్రభాస్ అనుచరులు మాత్రం ప్రభాస్ ఆరోగ్య పరిస్థితి గురించి బయటకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే ప్రభాస్ కల్కి సినిమా తరువాత ఎక్కడా కనిపించలేదు. దీంతో ప్రభాస్ కు అసలు ఏమైంది అనే ప్రశ్నలు వస్తున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో చాలా పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. మరి వాటి పరిస్థితి ఏంటి అనే సందేహాలు వస్తున్నాయి. ప్రభాస్ కోసం ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే మొదలు కావలిసిన ”స్పిరిట్” సినిమా షూటింగ్ కూడా వాయిదా పడింది. అలాగే ”ఫౌజీ”, ”సాలార్ 2”.. సినిమా షూటింగ్స్ లేట్ అవుతుంది అని సమాచారం. ఈ క్రమంలో ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ ఎప్పుడు విడుదల అవుతాయి అని ప్రశ్న నెలకొంది .