హైదరాబాద్ః ఏకంగా అడవిని దత్తత తీసుకోని తాను నిజంగా బాహుబలి అని నిరుపించుకున్నాడు హీరో ప్రభాస్. దుండిగల్ సమీపంలో ఖాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌లోని 1650 ఎకరాల అటవీ భూమి దత్తత తీసుకోని దాని అభివృద్ధికి అయ్యే ఖర్చంతా తానే భరించేందుకు ముందుకు వచ్చారు. ఎంపీ సంతోష్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి అర్బన్ పార్కుకు ప్రభాస్ మొక్కనాటి అర్బన్ ఫారెస్టుకు శంకుస్థాపన చేశాడు. ప్రభాస్ తీసుకున్న నిర్ణయంతో ఔటర్ రింగ్ రోడ్డు వెంట మరో అర్బన్ ఫారెస్ట్ పార్క్ అందుబాటులోకి రానుంది. తండ్రి దివంగత ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణరాజు పేరు మీద అర్బన్ పార్కు, అటవీ ప్రాంతాన్ని ప్రభాస్ అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం రూ.2 కోట్ల రూపాయలు అందించిన ప్రభాస్, అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
అడవిని దత్తత తీసుకున్న బాహుబలి.. అభివృద్ధికి ఎన్ని కోట్లంటే..
RELATED ARTICLES