Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ”ది రాజా సాబ్” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా రొమాంటిక్ హారర్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ డైరెక్టర్ పై కోపంగా ఉన్నాడు అని సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. అలాగే ఈ సినిమా అవుట్ ఫుట్ విషయంలో ప్రభాస్ చాలా అసంతృప్తిగా ఉన్నాడు అని సమాచారం. అలాగే ఈ సినిమా షూటింగ్ సమయంలో కూడా మారుతీ సరిగా సీన్స్ ను షూట్ చేయకపోగా ఎక్కువగా రీషూట్స్ చేసాడు అని అందుకే ప్రభాస్ సీరియస్ కూడా అయ్యాడు అని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా కొంచమే మిగిలి ఉంది. ప్రభాస్ ఒక 14 రోజులు ఇస్తే షూటింగ్ పూర్తి అవుతుంది. కానీ ప్రభాస్ మాత్రం మారుతీ సినిమాకి డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదుని కొందరు అంటున్నారు, అందుకే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమా కంటే ముందు ప్రభాస్ ”ఫౌజీ” సినిమాని రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు అని సమాచారం. ప్రస్తుతం మారుతీ సినిమా షూటింగ్ ని ప్రభాస్ క్యాన్సిల్ చేసాడు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై డైరెక్టర్ మారుతీ కానీ నిర్మాణ సంస్థ కానీ ఇప్పటివరకు స్పందించలేదు.