Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ”రాజాసాబ్”. ఈ సినిమాకి మారుతీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ నటిస్తుంది. ఈ హారర్ రొమాంటిక్ కామెడీ సినిమాని ఏప్రిల్ 10న సినిమాను విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం స్వయంగా ప్రకటించింది. అయితే ఇప్పుడు హఠాత్తుగా సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తునట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కు మరింత సమయం ఇవ్వాల్సి ఉన్నందున సినిమా విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమా ఆడియో వేడుకను జపాన్‌లో గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్రబృందం ప్లాన్ చేసింది. ఈ వార్తతో ప్రభాస్ అభిమానులకు నిరాశ అనే చెప్పాలి.