prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ (prabhas) అభిమానులను సంతోషపెట్టే వార్త ఒకటి బయటకు వచ్చింది. ప్రభాస్, రామ్ చరణ్ మంచి స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు రామ్‌చరణ్ ప్రభాస్ పెళ్లి గురించి ఆశ్చర్యకరమైన వార్తని వెల్లడించాడు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ”అన్‌స్టాపబుల్ షో”లో ప్రభాస్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అని రామ్‌చరణ్ పరోక్షంగా వెల్లడించాడు.
పెళ్లి గురించి ప్రభాస్‌ని బాలకృష్ణ అడగగా.. పెళ్లి కూతురు బహుశా ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం నుంచి అని చెప్పారు. ఈ క్రమంలో ప్రభాస్(prabhas) త్వరలో పెళ్లి చేసుకోవడం ఖాయమని పుకార్లు వినిపిస్తున్నాయి. రామ్‌చరణ్‌కి సంబంధించిన మొదటి భాగం జనవరి 8 నుండి ప్రసారం కాగా.. ఇప్పుడు ఎపిసోడ్ రెండవ భాగంలో, రామ్ చరణ్ ప్రభాస్ పెళ్లి గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఈ ఎపిసోడ్ జనవరి 17న ఆహాలో ప్రసారం కానుంది.