Homeహైదరాబాద్latest NewsPrabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కు శుభవార్త.. థమన్ అప్డేట్ అదిరిపోయిందిగా..!!

Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కు శుభవార్త.. థమన్ అప్డేట్ అదిరిపోయిందిగా..!!

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ”రాజాసాబ్” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా రొమాంటిక్ హారర్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి థమన్ ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయింది. చాలా కాలం తర్వాత ప్రభాస్ పక్క కమర్షియల్ పాటలతో వస్తున్నారు అని చెప్పాడు. అలాగే ఈ సినిమాలో మెలోడీ సాంగ్స్ తో పాటు అదిరిపోయే ఐటెం సాంగ్ కూడా ఉంది అని.. ఈ పాటలో ప్రభాస్ డాన్స్ బాగా చేయనున్నారు అని థమన్ చెప్పాడు. ఈ సినిమా కోసం చేసిన కొన్ని పాటలు డిజైన్ చేశాను. కానీ అవన్నీ పాతవిగా ఉన్నాయి. అందుకే వాటన్నింటినీ పక్కన బెట్టి మళ్లీ కొత్త పాటలను ట్యూన్ చేస్తున్నాం.. ఈ క్రమంలో ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా ఉంటాయని థమన్ అన్నారు. ఈ సినిమా త్వరలోనే థియేటర్లో విడుదల కానుంది.

Recent

- Advertisment -spot_img