Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ”స్పిరిట్” సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాలో ప్రభాస్‌ను ఎప్పుడూ చూడని విధంగా ఒక్క కొత్త యాక్షన్ హీరోగా ప్రెజెంట్ చేయబోతున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయింది అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఒక ఇంటర్నేషనల్ భామను సందీప్ సెట్ చేసాడు అని సమాచారం. పాపులర్ హాలీవుడ్ హీరోయిన్ ఎమ్మా స్టోన్ ఈ సినిమాలో ప్రభాస్ తో కలిసి నటించబోతుంది అని వినికిడి. ఈ సినిమా కధ ఎక్కువగా విదేశాల్లో నడుస్తుంది కాబట్టి దానికి తగట్టుగా డైరెక్టర్ ఈ భామ ను సలెక్ట్ చేసాడు. ఇప్పటివరకు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ భామలతో రొమాన్స్ చేసిన ప్రభాస్ త్వరలో హాలీవుడ్ భామతో కూడా వెండితెరపై చిందులు వేయనున్నాడు. ఈ వార్త విన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మెక్సికో లో ప్రారంభం కానుంది.